ఏంది మాకీ దరిద్రం.. బాబుకు కౌంటర్ ఇచ్చిన బండ్లన్న

ఏంది మాకీ దరిద్రం.. బాబుకు కౌంటర్ ఇచ్చిన బండ్లన్న

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu naidu) బీజీపీ లీడర్ అమిత్ షా(Amith sha)ను కలవడంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్(Bandla ganesh) షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఏంది మాకీ దరిద్రం అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. ఈ విషయంపై స్పందించిన బండ్ల గణేష్ ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.. 

"కర్మ కాకపోతే ఇంకేంటి.. ఆయన సిపిఎం(CPM) అంటే సిపిఎం అనాలి, బిజెపి(BJP) అంటే బిజెపి అనాలి, కాంగ్రెస్(Congress) అంటే కాంగ్రెస్ అనాలి, జనసేన(Janasena) అంటే జనసేన అనాలి. ఆయనకు కన్వీనెంట్ గా ఏ పేరు చెప్తే దాన్ని అందరు ఫాలో అవ్వాలి. అంతేగాని ఎవరికి ఆత్మాభిమానం మంచి, చెడు, మానవత్వం అనే ఉండవు. ఆయన పొగిడితే జాతిని పోగిడినట్టు.. లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టు ఇంతకంటే ఏం కావాలి.. దరిద్రం.’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో, అటు టీడీపీ వర్గాల్లో చర్చనీయ్యాంశం అయ్యాయి. మరి బండ్ల గణేష్ కామెంట్స్ కు టీడీపీ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.