థియేటర్స్‌‌తోనే స్టార్‌‌‌‌డమ్

థియేటర్స్‌‌తోనే స్టార్‌‌‌‌డమ్


‘ఈ రోజుల్లో’ చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఎస్.కె.ఎన్.. వరుస విజయాలతో సక్సెస్‌‌ఫుల్‌‌ నిర్మాతగా కొనసాగుతున్నారు. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే లాంటి చిత్రాలకు కో ప్రొడ్యూసర్​గా వ్యవహరించడంతోపాటు ‘టాక్సీవాలా’ చిత్రాన్ని సోలోగా నిర్మించారాయన. బుధవారం తన బర్త్ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం గోపీచంద్ హీరోగా మారుతి రూపొందిస్తున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాకి కో ప్రొడ్యూసర్‌‌‌‌గా ఉన్నాను. మారుతి దర్శకత్వంలోనే యూవీ క్రియేషన్స్‌‌తో కలిసి మరో సినిమా చేయబోతున్నాను. త్వరలో ఆ వివరాలను మారుతి చెప్తారు. ‘ఆహా’ కోసం తన ఆధ్వర్యంలోనే ‘త్రీ రోజెస్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాం. దర్శకుడు సాయి రాజేష్‌‌తో మూడు చిత్రాలు, ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్‌‌తో రెండు సినిమాలు చేయబోతున్నాను. రాహుల్ సాంకృత్యన్‌‌, వీఐ ఆనంద్, ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్‌‌‌‌లతోనూ సినిమాలు చేయనున్నాం. జీ5 కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌‌ కోసం ఒక వెబ్ సిరీస్ ప్రపోజల్‌‌ ఉంది. నేను, మారుతి కలిసి మాస్ మూవీ మేకర్స్ పేరుతో ఓ బ్యానర్ పెట్టి కొత్త టాలెంట్‌‌తో కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ చేయ బోతున్నాం. ఏడాదికి మూడు చిత్రాలు చేయాలనుకున్నాను. కానీ లాస్ట్ ఇయర్ కరోనా కారణంగా కొన్ని వాయిదా పడటంతో ఈ ఏడాది ఎక్కువ బిజీ అయ్యాను. నేను, బన్నీ వాసు, మారుతి, యూవీ వంశీ కలిసి సినిమాలు నిర్మిస్తున్నాం. అల్లు అరవింద్ గారి సలహాలు, సూచనలు తీసుకుంటూ సక్సెస్‌‌ఫుల్‌‌గా కొనసాగుతున్నాం. అయితే ఎన్ని ఓటీటీలు వచ్చినా థియేటర్ వ్యవస్థ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. థియేటర్స్ లేకపోతే హీరోలకి స్టార్‌‌‌‌డమ్‌‌ లేదు. అది తగ్గితే సినిమాల బడ్జెట్, స్పాన్ తగ్గుతాయి. పోయిన సారి లాక్‌‌డౌన్‌‌ తర్వాత థియేటర్స్ తెరిస్తే.. ఎక్కువ వసూళ్లు వచ్చింది తెలుగులోనే. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా భారీ ఓపెనింగ్స్‌‌తో సినిమాలను హిట్ చేసిన ఘనత తెలుగు ప్రేక్షకులదే’ అన్నారు.