చెప్పిన తేదీకి రాకీ భాయ్ వస్తున్నాడు

చెప్పిన తేదీకి రాకీ భాయ్ వస్తున్నాడు

కన్నడ సినిమా సత్తాని అందరికీ పరిచయం చేసిన సినిమా ‘కేజీయఫ్’. అందుకే ఆ మూవీ సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘కేజీయఫ్ 2’ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది.  ప్రస్తుతం పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతోంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా యశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చేసేశాడు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓ పెద్ద డైలమా ఉంది. కొవిడ్ కారణంగా ఇప్పటికే చాలాసార్లు డేట్ మారడంతో.. ఆల్రెడీ ప్రకటించినట్టు ఏప్రిల్ 14న రిలీజవ్వుద్దా అనే డౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొదలైంది. దీనిపై టీమ్ రియాక్టయ్యింది.

చెప్పిన తేదీకి రాకీ భాయ్ రావడం ఖాయమని నిన్న కన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్మ్ చేసింది. నిజానికి ఆమిర్ ఖాన్ ‘లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్ చద్ధా’ ఇదే రోజున విడుదల కావాల్సి ఉండటంతో గట్టి పోటీయే ఉంటుందనుకున్నారంతా. కానీ ఆ మూవీ ఆగస్ట్ 11కి వాయిదా పడటంతో రాకీ భాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి లైన్ క్లియరైంది. శ్రీనిధి శెట్టి హీరో యిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.  కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.