వెండితెరపై స్టార్ యాంకర్ రీ ఎంట్రీ.. కేవలం 6 రోజుల్లోనే కంప్లీట్

వెండితెరపై స్టార్ యాంకర్ రీ ఎంట్రీ.. కేవలం 6 రోజుల్లోనే కంప్లీట్

ఒకప్పటి బుల్లితెర స్టార్ యాంకర్ ఉదయభాను(Udayabhanu) మరోసారి వెండితెరపై రీ ఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా ఆమె "ఆగస్టు 6 రాత్రి"(August 6 Night movie) అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. ఆర్.కె.గాంధీ(R K Gandhi) దర్శకత్వంలో ధన్విక్ క్రియేషన్స్ సమర్పణలో, స్నేహాలయం క్రియేషన్స్ పతాకంపై బి. సుధాకర్, కంభం దినేష్ కుమార్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే... ఈ సినిమా మొత్తం షూటింగ్ ను కేవలం ఆరు రోజుల్లోనే కంప్లీట్ చేయనున్నారు. ఈ సందర్బంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లాడుతూ ఆగస్టు 6 రాత్రి సినిమా గురించి వివరించారు.. ''ఇప్పటికి ఐదు రోజులు షూటింగ్ పూర్తి చేశాం. ఇంకా ఒక్కరోజు షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. బెంగళూరు, నెల్లూరు, అనంతపురంలో చిత్రీకరణ పూర్తి అయ్యింది. అతి త్వరలో హైదరాబాద్ లో లాస్ట్ షెడ్యూల్ చేస్తాం. ఈ షెడ్యూల్ లో ఉదయభాను పాల్గొంటారు. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. కేవలం ఒక్కరోజులోనే ఆమెకు సంబందించిన పార్ట్ మొత్తం షూట్ చేస్తామని తెలిపారు". ఇక వినూత్న కథాంశంతో రానున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.