టాలీవుడ్లో మరో విషాదం.. రచయిత కీర్తి సాగర్ మృతి

టాలీవుడ్లో మరో విషాదం.. రచయిత కీర్తి సాగర్ మృతి

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ కథా రచయిత కీర్తి సాగర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఎవరూ రాలేరు. దీంతో కీర్తీ సాగర్ మృత దేహన్ని  మార్చురీలోనే ఉంచారు. హైదరాబాద్‌ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఛాన్సులు రావడం లేదని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి రచయిత కీర్తి సాగర్..వందలాది కథలు రాసినా సినిమా ఛాన్స్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూశాడు. తాను రాసిన కథలు ఎవరూ వినడం లేదనే బాధతో డిప్రెషన్ లోకి వెళ్లాడు. కథలు రాసిన పేపర్లతో ఆయన గది నిండిపోయింది.

సినిమా కథలంటే కీర్తిసాగర్ కు ప్రాణం..ఎన్నో ఏళ్లుగా తనలో ఉన్న భావాలతో ఊపిరిపోసుకున్నాయి కథలు.. తాను రాసిన కథలు ఎవ్వరూ వినటం లేదని.. తనకు ఛాన్స్ ఇవ్వడం లేదని మనస్థాపానికి గురయ్యాడు.  ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేస్తున్నారు.