
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. యువ నటుడు సుధీర్ వర్మ విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుధీర్ మృతి విషయాన్ని నటుడు సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వ్యక్తిగత కారణలతోనే సుధీర్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్, షూటౌట్ ఎట్ ఆలేరు చిత్రాల్లో సుధీర్ నటించారు. ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివారలు తెలియాల్సి ఉంది. సుధీర్ నటించిన కుందనపు బొమ్మ సినిమాలో సుధాకర్ కోమాకుల హీరోగా నటించాడు. సుధీర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.