
మాంచెస్టర్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ టూ మ్యాచ్‌లో వింత సంఘటన ఒకటి చోటు చేసుకుంది. గ్లౌసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్ లో లాంక్షైర్ క్రికెటర్ టామ్ బెయిలీ ఫోన్ పిచ్ మధ్యలో పడడం చేసిన పని వైరల్ అవుతుంది. బెయిలీ తొలి పరుగు పూర్తి చేసి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో బ్యాట్ పెట్టే సమయంలో అతని జేబులో నుంచి ఫోన్ కింద పడింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అతను ఫోన్ కొంద పడినది చూసుకోకుండా రెండో పరుగు కోసం పరిగెత్తాడు.
34 ఏళ్ల బెయిలీ తన ప్యాంటు జేబులో మొబైల్ పెట్టుకుని బ్యాటింగ్ చేయడంతో కొంతమంది అభిమానులు అతనిపై చర్యలు తీసుకోవాలని.. మరికొందరూ గ్రౌండ్ లో ఇలాంటి వస్తువులు తీసుకురాకుండా భేరా జరిమానా విధించాలని సూచిస్తున్నారు. లంకాషైర్ జట్టు తరపున ప్రధాన బౌలర్ గా జట్టులో కొనసాగుతున్న టామ్ బెయిలీ పదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. 34 ఏళ్ల బెయిలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దాదాపు 400 వికెట్లు తీసిన అనుభవజ్ఞుడైన సీమర్.
మ్యాచ్ ఆడుతున్న సమయంలో గ్రౌండ్ లోని మొబైల్ తీసుకొని రావడం రూల్స్ కు విరుద్ధం. బెయిలీ చేసిన పని ఫిక్సింగ్ కు అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ సంఘటనతో టామ్ బెయిలీ జరిమానాతో పాటు నిషేదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ లో బెయిలీ 31 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. లాంక్షైర్ తన తొలి ఇన్నింగ్స్‌లో 450 పరుగులకు ఆలౌట్ అయింది.
Mobile phone pops out of the pocket while running. 😂pic.twitter.com/G4kztI0gIs
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 4, 2025