స్పైడర్‌ మ్యాన్‌ కూడా ఆర్ఆర్ఆర్ అభిమానే.. ఇది కదా బ్రాండ్ అంటే

స్పైడర్‌ మ్యాన్‌ కూడా ఆర్ఆర్ఆర్ అభిమానే.. ఇది కదా బ్రాండ్ అంటే

స్పైడర్‌ మ్యాన్‌(Spider man) హీరో టామ్ హాలండ్(Tom Holland) ఆర్ఆర్ఆర్(RRR) అభిమానేనట. స్వయంగా టామ్ హాలండ్ ఈ మాట చెప్పడంతో ప్రస్తుతం ఈ న్యూస్ ఇంటర్నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. తాజాగా స్పైడర్ మాన్ హీరో హీరోయిన్ టామ్ హాలండ్, జెండాయ నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం ముంబైకి వచ్చారు. ఇండియాలో తన ఫస్ట్ ట్రిప్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు టామ్ హాలండ్. 

“ఇండియాలో నేను, జెండాయ సూపర్బ్ టైమ్ స్పెండ్ చేసాం. అది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వెకేషన్. నేను మళ్లీ ఇండియాకి రావడం కోసం ఎదురు చూస్తున్నాను. గ్రేట్ పీపుల్ ని మీట్ అయ్యాను. అంబానీ కల్చరల్ సెంటర్ చాలా బాగుంది. ఇండియా ట్రిప్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది” అని చెప్పుకొచ్చాడు టామ్ హాలండ్. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి కూడా మాట్లాడిన ఈ  హీరో.. “నేను ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను, నాకు చాలా బాగా నచ్చింది” అని చెప్పాడు. ఇక ఇంటర్నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న స్పైడర్ మాన్ హీరో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడడంతో ఈ వీడియో కాస్త ట్రేండింగ్ గా మారింది.