టూల్స్ గాడ్జెట్స్ : ఆర్మ్‌‌‌‌‌‌‌‌ రెస్ట్‌‌‌‌‌‌‌‌

టూల్స్ గాడ్జెట్స్ : ఆర్మ్‌‌‌‌‌‌‌‌ రెస్ట్‌‌‌‌‌‌‌‌

ఆర్మ్‌‌‌‌‌‌‌‌ రెస్ట్‌‌‌‌‌‌‌‌

ఎక్కువసేపు కంప్యూటర్​ ముందు కూర్చుని పనిచేసేవాళ్లలో చాలామందికి భుజాల నొప్పి వస్తుంది. దానికి కారణం.. చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఉండే ఆర్మ్‌‌‌‌‌‌‌‌ రెస్ట్‌‌‌‌‌‌‌‌ టేబుల్​ కంటే తక్కువ ఎత్తులో ఉండడమే. అందుకే.. ఏబీ సేల్స్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ ఈ టేబుల్​ రెస్ట్‌‌‌‌‌‌‌‌ని మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. దీన్ని మన్నికైన ఏబీఎస్​ ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌తో తయారు చేశారు. దీనికి పై భాగంలో ప్యాడెడ్ మెమరీ ఫోమ్ ఉంటుంది. ఆ ఫోమ్​ వల్ల మణికట్టు, భుజం మీద  పడే ఒత్తిడి తగ్గుతుంది. దీన్ని టేబుల్​కు ఈజీగా ఎటాచ్​ చేయొచ్చు. ఎడమ, కుడి పక్కలకు180  డిగ్రీల యాంగిల్​ వరకు అడ్జెస్ట్ చేసుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల బ్లడ్​ సర్క్యులేషన్​ కూడా బాగుంటుంది. 

ధర : 479 రూపాయలు 

హివాగీ

ఈ డెస్క్‌‌‌‌‌‌‌‌ హ్యుమిడిఫయర్​ మూడు రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని హివాగీ కంపెనీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చింది. ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ డిజిటల్ క్లాక్, అలారం, హ్యుమిడిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా పనిచేస్తుంది. దీన్ని 10 వోల్ట్స్‌‌‌‌‌‌‌‌ ఎడాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఛార్జ్‌‌‌‌‌‌‌‌ చేయాలి. 180 ఎంఎల్​ వాటర్ ట్యాంక్ ఉంటుంది. దానివల్ల ఎక్కువసేపు హ్యుమిడిఫికేషన్​ ఇస్తుంది. ట్యాంక్‌‌‌‌‌‌‌‌లో నీళ్లు లేకపోతే.. ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌గా పవర్-ఆఫ్ అయిపోతుంది. ఒకసారి నీళ్లను నింపితే దాదాపు 8 గంటలు నాన్‌‌‌‌‌‌‌‌స్టాప్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తుంది. అరోమా డిఫ్యూజర్‌‌‌‌‌‌‌‌ వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. హ్యూమిడిఫయర్ ఇంట్లో గాలి నాణ్యతను పెంచుతుంది కూడా. పెంపుడు జంతువులు, స్మోకింగ్​ వల్ల వచ్చే వాసన కూడా తగ్గుతుంది. ఇది అల్ట్రాసోనిక్ ఎసెన్షియల్ మిస్ట్ ఆయిల్ డిఫ్యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా పనిచేసి గదిని సువాసనతో నింపుతుంది.  కాకపోతే... ఇందులో నీళ్లతో పాటు ఐదు లేదా పది చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపాలి.

ధర: 2,500 రూపాయలు

అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌ డ్రాయర్

ఈ మధ్య తక్కువ బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో వస్తున్న కంప్యూటర్​ టేబుళ్లకు డ్రాయర్లు ఉండడం లేదు. అందుకే అజస్కోప్​ అనే కంపెనీ పెన్నులు, పెన్‌‌‌‌‌‌‌‌డ్రైవ్​లు, చిన్న చిన్న వస్తువులు దాచుకోవడానికి డిటాచబుల్​ అండర్​ డెస్క్‌‌‌‌‌‌‌‌ డ్రాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తీసుకొచ్చింది. దీన్ని డెస్క్‌‌‌‌‌‌‌‌ కింద ఈజీగా స్టిక్‌‌‌‌‌‌‌‌ చేసుకోవచ్చు. క్వాలిటీ బేరింగ్‌‌‌‌‌‌‌‌తో వస్తుంది. అంతేకాదు.. డస్ట్‌‌‌‌‌‌‌‌ ఫ్రూఫ్​ టెక్నాలజీతో బిల్డ్‌‌‌‌‌‌‌‌ చేశారు. బాక్స్‌‌‌‌‌‌‌‌లో దుమ్ము పేరుకుపోదు. ఈ డెస్క్​ డ్రాయర్ను ఇన్‌‌‌‌‌‌‌‌స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ. గ్లూపైన ఉండే స్టిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తీసేసి అతికించుకోవచ్చు. 

ధర: 329 రూపాయలు 

ఇన్ఫినిటీ గ్లాస్​

డెస్క్‌‌‌‌‌‌‌‌ ముందు వర్క్‌‌‌‌‌‌‌‌ బిజీలో ఉన్నప్పుడు.. చేయాల్సిన పనులు కొన్నిసార్లు మర్చిపోతుంటాం. టు–డు లిస్ట్‌‌‌‌‌‌‌‌లో యాడ్ చేసుకున్నా కొన్నిసార్లు గుర్తుండదు. అలాంటప్పుడు ఈ ఇన్ఫినిటీ గ్లాస్​ డెస్క్‌‌‌‌‌‌‌‌టాప్​ ప్యాడ్‌‌‌‌‌‌‌‌ని వాడితే సరిపోతుంది. క్వార్టెట్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చింది. కీబోర్డ్, మానిటర్ మధ్యలో ఇన్ఫినిటీ గ్లాస్​ను పెట్టుకోవచ్చు. దీనిపై మార్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాయొచ్చు. తుడిపేయెచ్చు. ఈ గ్లాస్​కు డ్రాయర్​ కూడా ఉంటుంది. అందులో పెన్నులు, మార్కర్లు వంటివి పెట్టుకోవచ్చు. 

ధర: 1,999 రూపాయలు