టూల్స్ గాడ్జెట్స్..మినీ మాప్

టూల్స్ గాడ్జెట్స్..మినీ మాప్

మినీ మాప్

ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ మీద నీళ్లు పడితే మాప్‌‌‌‌తో తుడుస్తారు. కానీ చిన్న వస్తువులు,షెల్ఫ్‌‌‌‌ల్లో నీళ్లు పడితే ఎలా? అందుకే ఈ మినీ మాప్‌‌‌‌ వచ్చేసింది మార్కెట్‌‌‌‌లోకి. దీన్ని హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ అనే కంపెనీ తెచ్చింది. దీంతో చిన్న చిన్న మూలల్లో కూడా క్లీన్‌‌‌‌ చేయొచ్చు. గోడలు, గ్లాస్‌‌‌‌, కౌంటర్‌‌‌‌ టాప్‌‌‌‌లు, సీలింగ్‌‌‌‌ ఫ్యాన్‌‌‌‌, కార్ ఇంటీరియర్‌‌‌‌లాంటి వాటిని క్లీన్‌‌‌‌చేసేందుకు ఇది బెస్ట్ చాయిస్‌‌‌‌. ఇది పుష్ అండ్‌‌‌‌పుల్ డిజైన్‌‌‌‌తో వస్తుంది. పుల్‌‌‌‌ చేసినప్పుడు మాప్‌‌‌‌180 డిగ్రీల బలమైన ఫోల్డబుల్‌‌‌‌ కంప్రెషన్‌‌‌‌లోకి వెళ్లిపోతుంది. దాంతో చుక్క నీళ్లు లేకుండా కారిపోతాయి. ఎకో ఫ్రెండ్లీ స్పాంజ్ హెడ్‌‌‌‌తో వస్తుంది. ఈ స్పాంజ్​ని మార్చుకోవచ్చు.  

ధర : 299 రూపాయలు 

స్మార్ట్ ఫ్రిడ్జ్‌‌

ఇంట్లో అయితే చల్లటి నీళ్లు తాగాలనుకున్నప్పుడల్లా ఫ్రిడ్జ్‌‌‌‌ డోర్‌‌‌‌‌‌‌‌ తీసుకుని గటగటా తాగేయొచ్చు. అదే బయటకు వెళ్తే... అదికూడా కారులో లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు అయితే... చల్లటి నీళ్లు దొరకడం కాస్త కష్టమే. ఇలాంటప్పుడు పోర్టబుల్‌‌‌‌ స్మార్ట్ కప్‌‌‌‌ని వెంట తీసుకెళ్తే చాలు. చల్లచల్లటి నీళ్లు తాగొచ్చు. ఈ స్మార్ట కప్​ని ‘హూక్స్‌‌‌‌’ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చింది. ఇది నీటిని చల్లగా ఉంచడమే కాకుండా వేడి చేస్తుంది కూడా. చలికాలంలో బయటికి వెళ్లినప్పుడు గోరు వెచ్చని నీళ్లు తాగాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్​ వాడుకోవచ్చు అన్నమాట. + లేదా -–5 డిగ్రీల వరకు నీళ్లను చల్లబరుస్తుంది. 55 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తుంది. చిన్న థర్మో ఎలక్ట్రిక్ చిప్ ద్వారా ఇది పనిచేస్తుంది. హై హీట్ కండక్షన్ సిస్టమ్ ద్వారా నీళ్లను వేడి చేస్తుంది. ఇందులో ఏవియేషన్ అల్యూమినియం వాడారు. ఈ కప్పులో అర లీటర్‌‌‌‌‌‌‌‌ నీళ్లు పోయొచ్చు. కారులో ఉండే 12 వోల్ట్స్‌‌‌‌పవర్‌‌‌‌‌‌‌‌కి కేబుల్‌‌‌‌ ద్వారా కనెక్ట్‌‌‌‌ చేస్తే చాలు. 

ధర: 1,000 రూపాయలు

పెప్పర్‌‌‌‌గ్రైండర్‌‌‌‌

పెప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పౌడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాల్సినప్పుడల్లా మిరియాలను మిక్సీలో పట్టి.. లేదంటే రోట్లో దంచి కూరల్లో, సలాడ్స్‌‌‌‌‌‌‌‌పై చల్లుకుంటారు. ప్రతిసారి ఇలా చేయడం కాస్త ఇబ్బందే అందుకే లైరొవొ అనే కంపెనీ గ్రావిటీ పెప్పర్ మిల్లు తెచ్చింది. పెప్పర్‌‌‌‌‌‌‌‌ ఒక్కటే కాదు.. రాక్‌‌‌‌‌‌‌‌సాల్ట్‌‌‌‌‌‌‌‌ లాంటి వాటిని కూడా ఇందులో పొడి చేసుకోవచ్చు. పైన ఉండే కప్పులాంటి భాగంలో మిరియాలు పోయాలి. దాని కింద ఉండే డివైజ్‌‌‌‌‌‌‌‌లో 6 AAA బ్యాటరీలు వేయాలి. తర్వాత స్విచ్‌‌‌‌‌‌‌‌ నొక్కితే పెప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పౌడర్​ రెడీ అయిపోతుంది. దీనికి ఒక ఎల్‌‌‌‌‌‌‌‌ఈడీ లైట్‌‌‌‌‌‌‌‌ కూడా ఉంది. ఇది ఉండడం వల్ల ఫుడ్‌‌‌‌‌‌‌‌లో ఎంత పెప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడుతుందనేది క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలుస్తుంది. దీన్ని  క్లీన్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు ప్రత్యేకంగా యుటిలిటీ బ్రష్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. దాంతో ఈజీగా శుభ్రం చేసేయొచ్చు.  

ధర: 800 రూపాయలు

కూల్‌‌మామ

కొన్ని సార్లు ఫ్రిడ్జ్‌‌‌‌లో ఫుడ్‌‌‌‌ పెట్టి మర్చిపోతాం. కొన్ని రోజులకు అది పాడైపోయి ఫ్రిడ్జ్‌‌‌‌ అంతా దుర్వాసనతో నిండిపోతుంది. అదే ఈ కూల్‌‌‌‌ మామ ఫ్రిడ్జ్‌‌‌‌లో ఉంటే ఇలాంటి ఇబ్బందే ఉండదు. ఇది ఫ్రిజ్ క్లీనర్‌‌‌‌‌‌‌‌లా పనిచేస్తుంది. దుర్వాసన పీల్చుకుని ఫ్రిడ్జ్‌‌‌‌ను ఫ్రెష్‌‌‌‌గా ఉంచుతుంది. ఈ రిఫ్రిజిరేటర్ ఎయిర్ ఫిల్టర్‌‌‌‌‌‌‌‌ని పరాత్పర్​ మాల్‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో కాస్త బేకింగ్ సోడా వేసి ఫ్రిడ్జ్‌‌‌‌లో  పెడితే చాలు. 

ధర : 319 రూపాయలు