టూల్స్ గాడ్జెట్స్ : రాకిడ్​ రష్​ హెడ్​ ఫోన్స్

టూల్స్ గాడ్జెట్స్ : రాకిడ్​ రష్​  హెడ్​ ఫోన్స్

రాకిడ్​ రష్​  హెడ్​ ఫోన్స్

పిల్లల కోసం వైర్​లెస్ బ్లూటూత్ హెడ్​ఫోన్స్​ తీసుకొచ్చింది బోట్​ కంపెనీ. ​వీటిని రాకిడ్​ రష్​ హెడ్​ఫోన్స్ అంటారు. సాఫ్ట్​ ఇయర్ కప్స్, లైట్​ వెయిట్​, డ్యూరబుల్, అడ్జస్టబుల్​, అడాప్టబుల్​ మెటీరియల్స్ వాడి డిజైన్​ చేశారు. సాఫ్ట్​గా, స్కిన్ ఫ్రెండ్లీగా ఉండే ఇయర్ కప్స్ వల్ల సేఫ్, కంఫర్టబుల్​గా హెడీ క్వాలిటీ మ్యూజిక్​ వింటూ ఎంజాయ్ చేయొచ్చు. వీటిలో35 డిబి వరకు నాయిస్ క్యాన్సిలేషన్​తోపాటు ​85 డెసిబుల్స్​ (డిబి) సౌండ్ లిమిట్​ ఉంది. దీని బ్యాటరీ 10 గంటలు పనిచేస్తుంది. ఛార్జింగ్ కోసం యుఎస్​బి టైప్​ -సి ఫాస్ట్​ ఛార్జింగ్​, వాల్యూమ్, ట్రాక్ ఛేంజ్​ కోసం టచ్ కంట్రోల్, డ్యూయల్ కనెక్టివిటీ బ్లూటూత్​, మల్టీ డివైజ్ పెయిరింగ్, ఫోన్ కాల్స్, వాయిస్ అసిస్టెంట్​, మైక్రో ఫోన్​ ఉంది. రాకిడ్​ రష్​ హెడ్​ ఫోన్స్ 20హెచ్​జెడ్​– 20 కెహెచ్​జెడ్​ ఫ్రీక్వెన్సీ, 360 గ్రాముల బరువుతో అన్ని రకాల బ్లూటూత్​ డివైజ్​లకు సరిపోయేలా తయారుచేశారు. వీటిలో రకరకాల డిజైన్లు, షేప్స్, కలర్స్​ కూడా ఉన్నాయి. ఇవి ఆన్​లైన్​లో దొరుకుతాయి. 

ధర : 1,499 రూపాయలు

ఫిడ్జెట్ టాయ్

పిల్లల్ని అల్లరి చేయకుండా ఉంచేందుకు పేరెంట్స్ చాలా ప్రయత్నిస్తుంటారు. మాట విననప్పుడు కోపంతో రెండు దెబ్బలు కూడా వేస్తుంటారు. అలాగే కొందరు పెద్దవాళ్లు బాగా ఒత్తిడి​లో ఉన్నప్పుడు కాలు ఊపడం, పెన్​ పట్టుకుని క్లిక్ చేయడం, బబుల్ ర్యాప్ పాపింగ్​ చేయడం వంటివి చేస్తుంటారు. ఈ రెండు సందర్భాల్లో ఈ గాడ్జెట్​ బాగా పనిచేస్తుంది. అల్లరి చేసే పిల్లలకు, స్ట్రెస్​లో ఉన్న పెద్దవాళ్ల చేతికి ఫిడ్జెట్ టాయ్ ఇచ్చేస్తే సరి. చూడ్డానికి అది రూబిక్స్ క్యూబ్​లా ఉన్నా దాంతో రకరకాల షేప్స్ తయారుచేయొచ్చు. దీనివల్ల బ్రెయిన్​ ఫోకస్ పెరుగుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లొచ్చు. దీన్ని ఒక చేత్తోనే ఆడుకోవచ్చు. చిన్న సైజ్​, లైట్​ వెయిట్​తో ఉంటుంది. దీన్ని తయారుచేసింది చిక్ బడ్డీ బ్రాండ్​. 

ధర : 279 రూపాయలు  

బేబీ ఫోన్​ 

పెద్దవాళ్లు ఏం చేస్తే అదే పిల్లలు కూడా చేయాలనుకుంటారు. ఫోన్ పట్టుకుని మాట్లాడడం కూడా నేటి జనరేషన్​కి అలవాటు అవుతోంది. అయితే పిల్లల కోసం బేబీ ఫోన్​ టాయ్ మార్కెట్​లో ఉంది. ప్లస్ పాయింట్ బ్రాండ్ దీన్ని డిజైన్‌ చేసింది. చూసేందుకు బొమ్మ కారులా ఉంటుంది. దాని పైన ఫోన్​, నెంబర్స్ కనిపిస్తాయి. ఫోన్ చేత్తో పట్టుకుని, నెంబర్లు నొక్కితే రకరకాల మ్యూజిక్, నెంబర్స్, సౌండ్స్, లైట్స్ వంటివి వస్తాయి. ఈ బేబీ ఫోన్​ 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలకు చాలా బాగుంటుంది. దీనికి మూడు బ్యాటరీలు వేసి వాడాల్సి ఉంటుంది. ఈ ప్రొడక్ట్ మల్టీ కలర్స్​లో అందుబాటులో ఉంది. ఆన్​లైన్​లో అతి తక్కువ ధరకే దొరుకుతుంది ఈ బుజ్జి ఫోన్.

ధర :  499  రూపాయలు

టాకింగ్ ఫ్లాష్​ కార్డ్స్

ఈ గాడ్జెట్​లో జంతువుల గొంతు వినిపిస్తుంది. రకరకాల జంతువుల గొంతులు ఇమిటేట్ చేసి పిల్లల్ని నవ్విస్తుంటారు. అలాగే వాటి సౌండ్స్ గుర్తుపట్టి ఆ జంతువు పేరు చెప్పమని అడుగుతుంటారు. అయితే అందరూ అన్ని రకాల వాయిస్​లు ఇమిటేట్ చేయలేరు కదా. అలాంటప్పుడు ఈ గాడ్జెట్ బాగా పనికొస్తుంది. దీనికి కొన్ని జంతువుల బొమ్మలు ఉన్న కార్డ్స్ వస్తాయి. వాటిని గాడ్జెట్​ లోపల పెట్టి బటన్ నొక్కితే ఆ జంతువుల అరుపులు బయటకు వినిపిస్తాయి. అప్పుడు పిల్లలు దాని గొంతు​తోపాటు, బొమ్మను చూసి జంతువుని కూడా గుర్తుపెట్టుకుంటారు. దీన్ని ఇంట్లో, స్కూల్లో ఎక్కడైనా ఆడుకోవచ్చు. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఛాయిస్ ఇది. మెమొరీ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇలాంటి ఎడ్యుకేషనల్ టాయ్ మూడేండ్ల నుంచి ఆరేండ్ల పిల్లలకు బాగా పనికొస్తుంది. 

ధర : 344 రూపాయలు