దక్షిణాఫ్రికా పై టీ20లో ఇరగదీసిన ఐదుగురు క్రికెటర్లు వీళ్లే

దక్షిణాఫ్రికా పై టీ20లో ఇరగదీసిన ఐదుగురు  క్రికెటర్లు వీళ్లే

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కి టీంఇండియా రెడీ అవుతోంది.. జూన్ 9 న ఇరు జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.  దక్షిణాఫ్రికా పైన టీ20లో అత్యధిక పరుగులు చేసిన ​ఐదుగురు టీంఇండియా క్రికెటర్ల లిస్టు ఒకసారి చూద్దాం..!

 

రోహిత్ శర్మ : ఈ లిస్టులో రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.. దక్షిణాఫ్రికా పైన 13 టీ20 మ్యాచ్ లు ఆడిన రోహిత్.. 32.90 సగటుతో 362 పరుగులు చేశాడు.. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలున్నాయి.. అత్యుత్తమ  స్కోరు 106.

సురేష్ రైనా : మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సురేష్ రైనా కూడా దక్షిణాఫ్రికాపై భారీ పరుగులే చేశాడు..  దక్షిణాఫ్రికా పైన మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన రైనా ..  33.90 సగటుతో 339 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది... అత్యుత్తమ స్కోరు 101.

విరాట్ కోహ్లీ : దక్షిణాఫ్రికాపై  మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ36.28 సగటుతో 254 పరుగులు చేశాడు. ఇందులో  రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 72.

శిఖర్ ధావన్ :  మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లలో దక్షిణాఫ్రికాపై 33.28 సగటుతో 233 పరుగులు చేశాడు ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్... ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది.. అత్యుత్తమ స్కోరు 72.

ఎంఎస్ ధోని : టీంఇండియా  మాజీ కెప్టెన్  ఎంఎస్ ధోని దక్షిణాఫ్రికాతో 13 టీ20 మ్యాచ్‌లు ఆడి 34.00 సగటుతో 204 పరుగులు చేసి ఐదవ స్థానంలో ఉన్నాడు.  ఇందులో ఒక అర్ధ సెంచరీ ఉంది. అత్యుత్తమ స్కోరు5 2