20వేల లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే కస్టమర్స్ రేటింగ్స్‌తో మంచి ఫీచర్స్

20వేల లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే కస్టమర్స్ రేటింగ్స్‌తో మంచి ఫీచర్స్

మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా ఎప్పటి కప్పుడు మారుతూ ఉండాలి. అది ఏ విషయంలోనైనా సరే పరిస్థితులను బట్టి ఛేంజ్ అవ్వాలి. లేదంటే ఈ ఆధునిక ప్రపంచంలో జీవించడం చాలా కష్టం.  ప్రస్తుతం మొబైల్ మార్కెట్‌లో 5G హవా నడుస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నాయి. 5జీ నెట్‌వర్క్‌ ఇలా వచ్చిందో లేదో అప్పుడే 5జీ మొబైల్స్‌ మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఇప్పటికే దాదాపుగా 2జీ, 3జీ కనుమరుగవగా త్వరలోనే 4జీకి కూడా అదే పరిస్థితి రావొచ్చు. 

ఎందుకంటే ఇంటర్నెట్‌లో ఏదైనా సెర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్ కోసం ఒకప్పటిలా వేచి చూసే ఓపిక ప్రస్తుతం ఎవరికీ లేదు. అత్యంత వేగంతో ఇంటర్నెట్ ఉండే మొబైల్స్‌ వైపే వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మెజారిటీ వ్యక్తులు 5జీ మొబైల్స్ కొనడానికి మొగ్గుచూపుతున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల 5జీ మొబైల్స్ ఉన్నాయి. దీంతో వీలైనంత తక్కువ రేటులో బెస్ట్ 5జీ మొబైల్స్ ఏదో అర్థం కాక వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలో వినియోగదారులు ఇచ్చిన రివ్యూల ఆధారంగా రూ.20 వేల లోపు ధరతో ఉన్న టాప్ 5జీ మొబైల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

షావొమీ రెడ్ మీ నోట్ 13
ధర రూ.16వేల 785
6.67 ఇంఛెస్ full HD, అమ్లేడ్ డిస్ల్పే,  5000 mAh బ్యాటరీ లెఫ్ తో ఈ ఫోన్ అందుబాటులో  ఉంది.

సామ్ సాంగ్ గ్యాలక్సీ M34
6.5 ఇంఛెస్ ఫుల్ HD అండ్ సూపర్ అమ్లేడ్ డిస్ల్పే ,  6000 mAh బ్యాటరీ లైఫ్ తో ఈ ఫోన్ రూ.15వేల 999 లకు వస్తోంది.

వన్ ప్లస్ నార్డ్ CE లైట్ 5G
6.72 అంగులాల ఫుల్ HD+ తోపాటు IPS LED డిస్ల్పే తో ఈ మొబైల్ 5000 mAh  బ్యాటరీతో రూ.17వేల 999 రేటు ఉంది.


మోటో G54 
6.5 అంగులాల ఫుల్ HD+ తోపాటు IPS LED డిస్ల్పే తో ఈ మొబైల్ 6000 mAh  బ్యాటరీతో రూ.15వేల 500లకు ఇది లభిస్తోంది. 

వివో Y200E 5G
6.67 ఇంఛెస్ ఫుల్ HD+ అండ్ అమ్లేడ్ డిస్ల్పే ,  5000 mAh బ్యాటరీ లైఫ్ తో ఈ ఫోన్ రూ.19వేల 999 లకు వస్తోంది.