జైశంకర్​పై బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ల ప్రశంసలు

జైశంకర్​పై బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ల ప్రశంసలు

వాషింగ్టన్: భారత్, అమెరికా సంబంధాల కు విదేశాంగ మంత్రి జైశంకర్ గొప్ప ఆర్కిటెక్ట్ అని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికా రులు కొనియాడారు. జైశంకర్ అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ఆయన గౌరవార్థం సోమవారం అక్కడి భారత్​అంబాసిడర్ తరన్​జిత్ సింగ్ సంధు విందు  ఏర్పాటు చేశారు. ఇందులో యూఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ రిచర్డ్ వర్మ, బైడెన్ సలహా దారు నీరా టాండన్ తదితరులు పాల్గొన్నా రు. అమెరికా భారత్​ బంధం బలోపేతంలో ఇండో అమెరికన్ల పాత్ర గొప్పదని రిచర్డ్ వర్మ అన్నారు. యూఎస్, భారత్​ సంబంధాల్లో జైశంకర్ ఆర్కిటెక్ట్ లాంటివారని ప్రశంసించారు. ఆయన ఆధ్వర్యంలో ఇరు దేశాల సంబంధాలు ఎంతో మెరుగయ్యాయని చెప్పారు.సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30దాకా జై శంకర్ అమెరికా పర్యటనలో ఉన్నారు.