తిరుమలలో కుండపోత వర్షం... నీట మునిగిన వీధులు

తిరుమలలో కుండపోత వర్షం... నీట మునిగిన వీధులు

తిరుమలలో భారీవర్షం కురుసింది.శనివారం రాత్రి నుంచి కుండపోతగా కురుసింది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎడతరిపి లేకుండా వర్షం పడటంతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో సామాగ్రి అంతా తడిసిపోయింది. 

ఇక రాంబగీచా పార్కింగ్ ఏరియాలో డ్రెయిన్ బ్లాక్ కావడంతో మోకాళ్ళలోతు వరద నీరు నిలిచిపోయాయి. వర్షపు నీటిలో బైకులతో సహా పలు వాహనాలు నీట మునిగాయి. వర్షపు నీటిని బయటకు పంపేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. 

తిరుమలలో కురుస్తు్న్న వర్షాలకు  మొదటి, రెండు ఘాట్ రోడ్లలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవాలయ అధికారులు సూచించారు. వర్షం కారణంగా కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్ర త్తగా వెళ్లాలని సూచించారు.