
సిటీలో శనివారం రాత్రి మరోసారి వర్షం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడడంతో లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయి. రోడ్ల పై వరద నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. పలు చోట్ల బైక్‌లు, కార్లు కొట్టుకుపోగా, రన్నింగ్ వాహనాలు వరదలో చిక్కుకొని ఆగిపోయాయి.
రాత్రి 11 గంటల వరకు నాంపల్లిలో 12. 4 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌లో 11.9, చార్మినార్‌లో 11.2, హిమాయత్ నగర్లో 10.3, ముషీరాబాద్‌లో 10.2, ఆసిఫ్ నగర్లో 9.73, అంబర్ పేటలో 9.23, హయత్ నగర్లో 9.15 సెం.మీ వర్షం కురిసింది. - వెలుగు, హైదరాబాద్ సిటీ