దేశచరిత్రలోనే కొత్త పథకం.. నేడు ఏపీలో ప్రారంభం

దేశచరిత్రలోనే కొత్త పథకం.. నేడు ఏపీలో ప్రారంభం

దేశ చరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద మొత్తం రూ. 4,000 కోట్లకు పైగా విడుదల

గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,880 కోట్ల బకాయిలు కూడా చెల్లింపు

నేడే జగనన్న విద్యాదీవెన పథకం ప్రారంభం

12 లక్షల మంది తల్లులకు లబ్ది

పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలని, డబ్బులేక వారి చదువులు మధ్యలోనే ఆగకూడదనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఒక కొత్త పథకాన్ని నేడు అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యార్థులకు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించే జగనన్న విద్యాదీవెన పథకాన్ని నేడు క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం దేశచరిత్రలోనే తొలిసారిగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందించే పథకం. పేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఈ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెడుతున్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు ఉన్నా పెద్ద చదువులు చదువుతున్న విద్యార్ధులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా దాదాపు 12 లక్షల మంది తల్లులు లబ్దిపొందనున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అన్ని త్రైమాసికాలకు సంబంధించి చెల్లించవలిసిన ఫీజులను బకాయిలు లేకుండా ఒకేసారి చెల్లించనున్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా  పిల్లల చదువుల కోసం కేవలం 11 నెలల కాలంలోనే దాదాపు రూ.12,000 కోట్లు ఈ ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. తాజాగా జగనన్న విద్యాదీవెన పథకాన్ని నేడు ప్రారంభించనుంది.

For More News..

సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనాకు మందు

లాక్డౌన్ ఎఫెక్ట్: చెక్క పడవలో 1100 కిలోమీటర్ల ప్రయాణం