మిజోరంలో హంగ్ .. ఎంఎన్ఎఫ్, జడ్​పీఎఫ్ మధ్య టఫ్ ఫైట్

మిజోరంలో హంగ్  ..   ఎంఎన్ఎఫ్, జడ్​పీఎఫ్ మధ్య టఫ్ ఫైట్
  • మిజోరంలో హంగ్  
  • ఎంఎన్ఎఫ్, జడ్​పీఎఫ్ మధ్య టఫ్ ఫైట్.. 
  • ఎగ్జిట్​పోల్స్​లో మిశ్రమ ఫలితాలు 

న్యూఢిల్లీ: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్ సాగుతోందని, ఏ పార్టీకీ క్లియర్ కట్ గా మెజార్టీ రాకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. మిజోరం అసెంబ్లీలో మొత్తం 40 సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్ల మెజార్టీ అవసరం. సీఎం జొరాంతంగ నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) మెజార్టీ మార్క్ ను దాటుతుందని రెండు సర్వేలు, మెజార్టీకి దగ్గరగా నిలుస్తుందని మూడు సర్వేలు చెప్తుండగా.. జోరాం పీపుల్స్ మూమెంట్ (జడ్ పీఎం) పార్టీ మెజార్టీని దాటుతుందని రెండు సర్వేలు వెల్లడించాయి.

 అయితే, ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ సర్వేలో జడ్ పీఎం కనీసం 17 సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 7 సీట్లు సాధిస్తుందని తేలింది. ఎంఎన్ఎఫ్ 14 సీట్లకే పరిమితమవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. ఈసారి బీజేపీ రెండు సీట్లను గెలుచుకుంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టం చేశాయి. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎంఎన్ఎఫ్ పోయినసారి ఎన్నికల్లో 26 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జడ్ పీఎం 8 సీట్లను, కాంగ్రెస్ 5 సీట్లను గెలుచుకున్నాయి.