
హాలియా, వెలుగు: నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఆదివారం డ్యాం పరిసరాలు సందడిగా మారాయి. యువత సెల్ఫీలు తీసుకుంటూ చిన్నారులు కేరింతలు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. లాంచీ స్టేషన్ నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు నాలుగు లాంచీ ట్రిప్పులను పర్యాటక శాఖ నడుపుతోంది. కొత్త బ్రిడ్జి, ఎత్తిపోతల, అనుపు, విజయవిహార్తదితర ప్రాంతాల్లో రోడ్లపై వాహనాల రద్దీ కనిపించింది.