రోప్ వేపై కేబుల్ కార్ జామ్.. చిక్కుకుపోయిన టూరిస్టులు

రోప్ వేపై కేబుల్ కార్ జామ్.. చిక్కుకుపోయిన టూరిస్టులు

కిందికి చూస్తే లోతైన లోయ.. పైన చూస్తే నీలాకాశం.. చుట్టూ వీస్తున్న బలమైన గాలులు.. ఈ పరిస్థితుల నడుమ ఇరుక్కుపోతే ఎంతో భయమేస్తుంది కదూ.. అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఒక్కో క్షణం గడపాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితే సోమవారం మధ్యాహ్నం హిమాచల్ ప్రదేశ్ లోని పర్వానూ పట్టణానికి వచ్చిన 11 మంది పర్యాటకులకు ఎదురైంది.  రోప్ వేపై వారు ఎక్కిన కేబుల్ కార్ ట్రాలీ మార్గం మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయింది.  దీంతో పర్యాటకులు గంటన్నర పాటు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. భయాందోళనతో  వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందని గుర్తించారు. హుటాహుటిన రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించి.. నిపుణుల పర్యవేక్షణలో తాళ్ల సాయంతో తొమ్మిది మందిని కిందికి దించారు. మిగతా  ఇద్దరిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి.