వెల్​నెస్​ టూర్లకు పోతున్నరు

వెల్​నెస్​ టూర్లకు పోతున్నరు

మనసు బాగాలేనప్పుడు, స్ట్రెస్​లో ఉన్నప్పుడు ఏం తోచదు. అలాంటప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో కొంచెం సేపు గడిపితే రిలీఫ్​గా అనిపిస్తుంది. దీన్నే ‘వెల్​నెస్​ టూరిజం’ అని పిలుస్తున్నారు. ఈ కరోనా కాలంలో చాలామంది  వెల్​నెస్​ టూర్లకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్​గా రిలాక్స్​​ అయ్యేందుకు వెల్​నెస్​ హాలిడేస్​కి వెళ్తున్నారు. మెంటల్​ హెల్త్​, ఇమ్యూనిటీ మీద ఫోకస్​ చేయడం కూడా అందుకు ఒక కారణం అంటున్నారు ట్రావెల్​ కంపెనీ యజమానులు. 

ప్రశాంతత కోసం ప్రకృతి అందాలకు నెలవైన ప్లేస్​లకి వెళ్తున్నారు కొందరు. మరికొందరు పర్వత ప్రాంతాల్లో ధ్యానం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒంటరిగా గడిపేందుకు, మెంటల్​గా స్ట్రాంగ్​ అయ్యేందుకు యోగా, ధ్యానం చేస్తున్నారు కొందరు. యంగ్​స్టర్స్​లో చాలామంది పెండ్లికి ముందు 15 రోజులు లేదా నెలంతా యోగా సెంటర్ల బాట పడుతున్నారని అంటోంది ఢిల్లీకి చెందిన ఒక ట్రావెల్​ కంపెనీ డైరెక్టర్​ నేహ ప్రణయ్​నాథ్​. టూరిస్ట్​ల ఛాయిస్​లని బట్టి పాపులర్​ టూరిస్ట్ ప్లేస్​లోని హోటల్స్​, రిసార్ట్స్​లు వెల్​నెస్ ప్యాకేజీలు కూడా ఆఫర్​ చేస్తున్నాయి. వెల్​నెస్​ టూర్లలో భాగంగా ఎక్కువమంది వెళ్తున్న ప్లేస్​లలో  డెహ్రాడూన్, కేరళ, రిషికేశ్​, కోయంబత్తూర్​, కూర్గ్​​ ​వంటివి టాప్​లో ఉన్నాయి. కిందటి ఏడాది కంటే ఈ ఏడాది వెల్​నెస్​ టూరిజం పెరగనుందని అంచనా.  గ్లోబల్​ వెల్​నెస్​ ఇనిస్టిట్యూట్​ పోయిన ఏడాది రిపోర్టులో 2022లో వెల్​నెస్​ టూరిజం 7.5శాతం పెరుగుతుందని చెప్పింది. 

వెల్​నెస్​ ప్యాకేజెస్​
‘‘ కేరళలోని చాలా టూరిస్ట్​ ప్లేస్​లు వెల్​నెస్​ టూరిజంకు ఫేమస్​. టూరిస్ట్​లు సెలక్ట్​ చేసుకునే ప్లేస్​ని బట్టి ధర ఉంటుంది. కొన్ని హోటల్స్​ వారం నుంచి పది రోజులకి రూ.15 నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నాయి. స్పెషల్​ ప్రోగ్రామ్స్ ఆఫర్​ చేసే లగ్జరీ రిసార్టులు రోజుకి రూ.25 నుంచి 50 వేల వరకు ఛార్జ్​ చేస్తాయి” అని చెప్తోంది నేహ​.