బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుని ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ ఓవైపు ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తూనే, మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ‘టాక్సిక్ : ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’. ఇందులో యశ్‌కు జోడీగా నటిస్తోంది. ఆదివారం ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు క్యారెక్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. నాడియా పాత్రలో కియారా కనిపించనున్నట్టు ప్రకటించారు. పోస్టర్‌ను గమనిస్తే కలర్‌ఫుల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంది. కియారా అందరి కంటే ముందు నిల్చోని కనిపిస్తుంది.
ఆమె పాత్రలో లోతైన ఎమోషన్ ఏదో ఉన్నట్లుగా అనిపిస్తోంది. పెర్ఫార్మెన్స్కు ప్రాధాన్యతనిచ్చేలా తన క్యారెక్టర్ ఉండనుందని తెలుస్తోంది. తన పాత్ర గురించి చిత్ర దర్శకుడు గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ ‘కొన్ని పాత్రల్లో నటించినప్పుడు అవి సినిమాకే పరిమితం కావు. యాక్టర్‌కు సరికొత్త గుర్తింపును తీసుకొస్తాయి. నాడియా పాత్రలో కియారా చేసిన నటన డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కనిపిస్తుంది. ఆమె పెర్ఫార్మెన్స్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఈ ప్రయాణంలో నాపై, నా టీమ్‌పై నమ్మకం పెట్టుకుని, మన స్ఫూర్తిగా సపోర్ట్ చేసిన ఆమెకు ధన్యవాదాలు’ అని చెప్పాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మార్చి 19న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అలాగే రణవీర్ సింగ్‌కు జంటగా ‘డాన్ 3’లోనూ కియారా కనిపించనుంది.
