టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫార్చూనర్, హిలక్స్ ల అమ్మకాలు నిలిపివేశారు.. ఎందుకో తెలుసా..

టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫార్చూనర్, హిలక్స్ ల అమ్మకాలు నిలిపివేశారు.. ఎందుకో తెలుసా..

టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, హిలక్స్ షిప్ మెంట్ ను డీజిల్ ఇంజన్లలో సర్టిఫికేషన్ లోపాల కారణంగా నిలిపివేసింది. ధృవీకరణ కోసం హార్స్ పవర్ అవుట్ పుట్ టెస్ట్ సమయంలో ఈ మూడు డీజిల్ ఇంజన్లలో అవకతవకలను గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆటో మొబైల్స్ కోసం ఈ డీజిల్ ఇంజన్లను అభివృద్ధి చేయడానికి టయోటా ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (టీఐసీఓ)ని నియమించినట్లు టయోటా మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. 

టయోటా సర్టిఫికేషన్ టెస్టింగ్ సమయంలో ఇంజన్ల హార్స్ పవర్ అవుట్ పుట్ పనితీరును ECUలను ఉపయోగించి భారీ ఉత్పతికి ఉపయోగించే సాఫ్ట్ వేర్ లను ఉపయోగించి కొలుస్తారు. భారత దేశంలో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, హిలక్స్ సహ పది వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితమైన ఇంజన్లను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 

భారత దేశంలో ఇన్నోవా క్రిస్టా, ఫార్య్చూనర్, హిలక్స్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయంపై ఎక్స్ ప్రెస్ డ్రైవ్ లు టయోటా కిర్లోస్కర్ ను సంప్రదించగా.. హార్స్ పవర్, టార్క్ లేదా ఇతర పవర్ ట్రెయిన్ వంటి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. 

ఈ వాహనాల డెలివరీని తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, హిలక్స్ తయారీ , ఆర్డర్లను తీసుకోవడం కొనసాగుతందని కంపెనీ ధృవీకరంచింది.