
న్యూఢిల్లీ: డీజిల్ ఇంజన్లకు సంబంధించిన సర్టిఫికేషన్ టెస్టులు అక్రమాలు బయటికి రావడంతో దేశంలో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, హైలక్స్‌ల పంపిణీని తాత్కాలికంగా మాత్రమే ఆపేశామని టయోటా కిర్లోస్కర్ మోటార్ వివరణ ఇచ్చింది.
ఈ మూడు డీజిల్ ఇంజన్ మోడల్‌లలో హార్స్‌పవర్ ఔట్‌పుట్ సర్టిఫికేషన్ పరీక్షలలో అవకతవకలు కనుగొన్నామని కంపెనీ ప్రకటించింది. ఈ మూడు మోడళ్ల కోసం కొత్త ఆర్డర్‌లను తీసుకోవడం కొనసాగిస్తుంది. డెలివరీకి హామీ ఇచ్చిన వారికి ఈ పరిస్థితి గురించి వివరిస్తామని కంపెనీ పేర్కొంది.