నిజామాబాద్ ను మోడల్ సిటీగా మారుస్తా : చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

నిజామాబాద్ ను మోడల్ సిటీగా మారుస్తా : చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  • రెండేండ్లలో రూ.500 కోట్లు ఖర్చు చేసినం
  • టీ పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ గౌడ్​

నిజామాబాద్​, వెలుగు:  రెండేండ్లలో నిజామాబాద్​అభివృద్ధికి రూ. 500 కోట్లు ఖర్చు చేసినట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​గౌడ్ ​తెలిపారు. రాబోయే రోజుల్లో మోడల్​సిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నా రు.  ఆదివారం సిటీలో రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు. కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్​లో రూ. కోటితో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మిస్తామన్నారు. పదేండ్ల పాలనలో నిధుల మంజూరులో బీఆర్ ఎస్ పాలకులు వివక్ష చూపారని విమర్శించారు.

తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తుందన్నారు. కార్పొరేషన్ లో  నీటి సమస్య లేకుండా శాశ్వత చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ తెలిపారు.  రేషన్​కార్డుదారులు 45 వేల మంది ఇండ్లకు ఉచిత నల్లా కనెక్షన్​ ఇవ్వనున్నట్టు చెప్పారు.  అర్బన్​ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ, నుడా చైర్మన్​ కేశవేణు, మున్సిపల్​ కమిషనర్​దిలీప్​కుమార్​, అగ్చికల్చర్​కమిషన్​ మెంబర్ గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​నగేశ్​రెడ్డి, సిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రత్నాకర్​ ఉన్నారు.