బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏం లేదు.. కాంగ్రెస్ మేనిఫెస్టోనే కాపీ కొట్టారు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏం లేదు.. కాంగ్రెస్  మేనిఫెస్టోనే కాపీ కొట్టారు : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.  బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏమీ లేదన్నారు.  తమ పార్టీ  హామీలను కాపీ కొట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను చూసి కేసీఆర్ కు చలి జ్వరం వచ్చిందన్నారు.   అవినీతికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిండర్ అన్న రేవంత్..  కేసీఆర్ కు  శాశ్వతంగా విశ్రాంతి అవసరమని  చెప్పారు.  

ఆలోచన చేసే సామర్థ్యం కేసీఆర్ కు లేదని,  కేసీఆర్ బుర్ర కరప్ట్ అయిందన్నారు రేవంత్ రెడ్డి.  సీఎం  కేసీఆర్ 51 మందికే బీఫామ్ లు ఇచ్చారని మిగతా వాళ్లకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఇవ్వబోమని కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్ద  ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.  వందకు వంద శాతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని,  ఇచ్చిన ఆరు  గ్యారెంటీలను ఆమలు చేస్తుందని హామీ ఇచ్చారు.