భూ నిర్వాసితులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నా

భూ నిర్వాసితులపై పోలీసుల దాడిని ఖండిస్తున్నా

"నీళ్లు పారాల్సిన ప్రాజెక్టుల్లో నిర్వాసితుల కన్నీళ్లు పారుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. భూ నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాటపై స్పందించిన ఆయన.. బీళ్లు తడపాల్సిన ప్రాజెక్టులు నిర్వాసితుల రక్తంతో తడుస్తున్నాయని తెలిపారు. సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి-గండిపెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

గౌరవెల్లి-గండిపెల్లి భూ నిర్వాసితులను అరెస్ట్ చేసే టైంలో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ముందస్తు అరెస్టులను నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగగా...  భూ నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు భూనిర్వాసితులకు గాయాలు కూడా అయ్యాయి. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.