
హనుమకొండ: బీజేపీ, టీఆర్ఎస్‌ల వైఖరిని హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎండగడతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కేంద్రంతో పోరాటం చేస్తున్నానని అంటున్నారని.. ఇది శుద్ధ తప్పన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల కోసమే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు కేసీఆర్‌ను దగ్గరకు తీస్తున్నారని చెప్పారు. కేసీఆర్ ఎంత అవినీతి చేసినా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఒక్క కేసు కూడా పెట్టడం లేదన్నారు. ‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చిన ప్లైట్‌ను కేసీఆరే అరెంజ్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో పెద్ద బకరా హరీష్ రావే. ఒకవేళ ఈ ఎలక్షన్‌లో ఈటల రాజేందర్ గెలిస్తే బండి సంజయ్, కిషన్ రెడ్డికి ప్రమాదం’ అని రేవంత్ పేర్కొన్నారు.