కేసీఆర్ సమస్యలను వదిలేసి ఆస్తులు కూడబెట్టకున్రు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ సమస్యలను వదిలేసి ఆస్తులు కూడబెట్టకున్రు : రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షలను కాలరాసి రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో సమూల మార్పు రావాలంటే కేసీఆర్ను గద్దెదించాలని.. అందుకే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించేందుకే పాదయాత్ర చేపట్టామని వివరించారు. హాథ్ సే హాథ్ యాత్రలో భాగంగా రామప్ప ఆలయం నుంచి రేవంత్ పాదయాత్ర ప్రారంభమైంది. కేసీఆర్ రాష్ట్రంలో సమస్యల తీవ్రతను పట్టించుకోకుండా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో పడ్డారని మండిపడ్డారు. మరోవైపు సమస్యలను పక్కనబెట్టి మోడీ ఎన్నికల ప్రణాళికలో మునిగితేలుతున్నారని  విమర్శించారు. దేశ ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైనా పట్టించుకోవడంలేదన్నారు.