రెండు రోజులుగా రేవంత్ రెడ్డికి జ్వరం

రెండు రోజులుగా రేవంత్ రెడ్డికి జ్వరం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనను కలిసినవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని కోరారు. మహమ్మారి పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలన్నారు రేవంత్ రెడ్డి, కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న రేవంత్ కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్ అనితేలింది. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. 

ఇవి కూడా చదవండి: 

స్టేషన్ లో రాత్రంత దీక్ష చేసిన బండి సంజయ్

టీఆర్ఎస్ ఏజెంట్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు