
- టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఫైర్
హైదరాబాద్,వెలుగు : బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ కాంగ్రెస్ 420 హామీలు అంటూ బుక్ లెట్ ను విడుదల చేయడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్విమర్శించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ ఓర్వలేకనే కేటీఆర్అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గురువారం ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే కొలమానమని ఆయనకు తెలియకపోవడం అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలులో పదేళ్లలో బీఆర్ఎస్పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.మంత్రిగా మున్సిపల్ శాఖలో కేటీఆర్ చేసిన 420 వ్యవహారాలను త్వరలోనే బయటకు తీస్తామన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో పరిణితి చెందిన నేతగా పాలన సాగిస్తూ గత సీఎంలను మరిపిస్తున్నారన్నారు.