ఏడాదైనా రైతులకు పరిహారం ఇవ్వరా..?: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జు

ఏడాదైనా రైతులకు పరిహారం ఇవ్వరా..?:   టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జు
కడెం, వెలుగు: గతేడాది కడెం ప్రాజెక్టు వరదల్లో మునిగిన పంట పొలాలకు సంబంధించి రైతులకు ఇప్పటి వరకు నష్ట పరిహారం చెల్లించకపోవడం దారుణమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన  కడెం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కడెం ప్రాజెక్టు మరమ్మతు పనుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.  వరదలు వచ్చి సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ రిపేర్లు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మండల నాయకులు మల్లేష్ యాదవ్, వాజిద్ ఖాన్, భూషణం, రఫిక్, రమేశ్, కాంగ్రెస్ పార్టీ  నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.