ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

ఇంద్రవెల్లి,(ఉట్నూర్) వెలుగు: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ స్కూళ్లలో పనిచేస్తున్న ఔట్​సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ను కోరారు. 

శుక్రవారం హైదరాబాద్​లోని చాంబర్​లో మర్యాదపూర్వకంగా కలిసి వినపత్రం అందజేశారు. గత 10 నెలలుగా బకాయిలు ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న క్యాటరింగ్ విధానాన్ని రద్దు చేసి, జీవో 60 ప్రకారం కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ విధానంలో వేతనాలు చెల్లించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ...సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు సుగుణ తెలిపారు.