ఇండియా–బంగ్లా మధ్య ట్రాన్స్ పోర్టు షురూ

ఇండియా–బంగ్లా మధ్య ట్రాన్స్ పోర్టు షురూ

న్యూఢిల్లీ: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య గూడ్స్ ట్రాన్స్ పోర్టు అధికారికంగా ప్రారంభమైంది. బెంగాల్ లోని పరగనాస్‌, బన్‌గాన్‌ పెట్రాపోల్‌ బోర్డర్ నుంచి వస్తువుల ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషన్ బార్డర్ లోని జీరో పాయింట్ వద్ద వస్తువుల బదిలీకి ఇండియా, బంగ్లా అధికారులు అంగీకరించడంతో గురువారం మధ్యాహ్నం నుంచి పెట్రాపోల్ ల్యాండ్ పోర్టులో దిగుమతి, ఎగుమతులు ప్రారంభమయ్యాయి. కస్టమ్స్, బీఎస్​ఎఫ్, పోలీసు అధికారులు, ల్యాండ్ పోర్టు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో కార్గోను మార్పిడి చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు వివరించారు. కరోనా వైరస్ ఎఫెక్టు నేపథ్యంలో రెండు దేశాలు.. బార్డర్లు మూసివేసి, గూడ్స్ ట్రాన్స్ పోర్టును బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.