లాక్ డౌన్ మరో వారం పొడిగించాలి

లాక్ డౌన్ మరో వారం పొడిగించాలి

ఢిల్లీలో కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుంది. ఈ కాలంలో కరోనా కేసులు తగ్గకపోగా... మరింత పెరిగాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ మరోవారం పాటు పొడిగించాలని వ్యాపారులు సీఎం కేజ్రీవాల్ కు విజ్ఞప్తి చేశారు. మార్కెట్లను మరోవారం పాటు మూసేసేందుకు వ్యాపారులు నిర్ణయం తీసుకున్నారు. మే 2 వరకు వాణిజ్య సముదాయాలు ఓపెన్ చేయకూడదని స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నట్టు కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ఢిల్లీ విభాగం తెలిపింది. 

ఇక ఢిల్లీ ప్రజలు కూడా ఇంకో వారం లాక్ డౌన్ కంటిన్యూ చేయాలని అభిప్రాయపడుతున్నారు. లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పబ్లిక్ సర్వే చేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో 48శాతం మంది రెండు వారాలైనా లాక్ డౌన్ ఎక్స్ టెండ్ చేయాలని అభిప్రాయపడ్డారు. 62వాతం మంది కనీసం మరోవారం పాటైనా లాక్ డౌన్ పొడిగించాలన్నారు. ఈ సర్వేలోని ఢిల్లీలోని 11 జిల్లాల్లో 8వేల మంది అభిప్రాయాలను సేకరించారు.