ఐపీఓ షేర్ల ట్రేడింగ్ రూల్స్ మారినయ్​

ఐపీఓ షేర్ల ట్రేడింగ్ రూల్స్ మారినయ్​

ముంబై: ఐపీఓ ముగిసిన తర్వాత లిస్టింగ్​ మొదటి రోజున షేర్ల ట్రేడింగ్​లో నమోదవుతున్న హెచ్చు–తగ్గులను గమనించిన సెబీ, ఇందుకోసం కొత్త రూల్స్​ తీసుకొచ్చింది. స్టాక్​ ఎక్స్చేంజీలతో డిస్కషన్​ తర్వాతే కొత్త రూల్స్​ తీసుకొస్తున్నారు. ఐపీఓ షేర్లకు  కాల్​ ఆక్షన్​ సెషన్లు కొనసాగుతాయని, ఆయా ఎక్స్చేంజీలలో సెపరేట్​గా వాటిని నిర్వహిస్తారని చెబుతూ, ఈక్విలిబ్రియం ప్రైస్​ లెక్కించిన తర్వాత ఆయా ఎక్స్చేంజీలు ఆ ఆర్డర్లను మ్యాచ్​ చేస్తాయని సెబీ తెలిపింది.

ఒకవేళ ఎక్స్చేంజీల మధ్య ఈక్విలిబ్రియం ప్రైస్​లో తేడాలుంటే...అంటే ఆ షేర్లకు అనుమతించిన ప్రైస్​ బ్యాండ్​ కంటే ఎక్కువ శాతం తేడా ఉంటే...అప్పుడు ఎక్స్చేంజీలు కామన్​ ఈక్విలిబ్రియం ప్రైస్​ లెక్కకడతాయని సెబీ ఈ తాజా రూల్స్​లో తెలిపింది. లిస్టింగ్​ రోజున ఒక్కో ఎక్స్చేంజీలో  కాల్​ ఆక్షన్​ సెషన్స్​లో షేర్ల రేటు ఒక్కోలా ఉండటాన్ని గమనించిన సెబీ తాజా రూల్స్​ తీసుకొచ్చింది. రెండు నెలల తర్వాత ఈ కొత్త రూల్స్​ అమలులోకి వస్తాయని పేర్కొంది.