కార్ లో హెల్మెట్ పెట్టుకోలేదని చలాన్ వేశాడు

కార్ లో హెల్మెట్ పెట్టుకోలేదని చలాన్ వేశాడు

బైక్ పై ఉన్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ఫైన్ వేశారంటే ఓ అర్థముంటుంది. కానీ.. విచిత్రంగా కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి హెల్మెట్ లేదని ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇదో విచిత్రం. ఈ సంఘటన కేరళలో జరిగింది.

గోపకుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. కేరళ పోలీస్ హిస్టరీలోనే ఇది పెద్ద తప్పు అని కామెంట్ పెట్టాడు. కొల్లాం జిల్లా సస్థంకొట్ట అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. KL 61 D 8000 నంబర్ ఉన్న టాటా నెక్సాన్ కారులో డ్రైవర్ కు చలాన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. కారులో ఉన్నా కూడా.. హెల్మెట్ ఉండాల్సిందేనంటూ … జరిమానా కింద చలాన్ వేసిన రిసీప్ట్ చూపించాడు. పోలీసులు కోరడంతో.. రూ.100 కట్టినట్టు వివరించాడు.

గోవాలో ఇలాంటిదే మరో సంఘటన

బైక్ పై వెళ్లేవాళ్లు హెల్మెట్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ.. సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఎవరైనా అడిగితే… కిందా మీదా చూస్తారెవరైనా. కానీ.. గోవాలో… రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నడిపిన ఓ వ్యక్తికి… సీట్ బెల్ట్ పెట్టుకోలేదని చలానా వేశారు అక్కడి పోలీసులు. ఈ సంఘటన గతంలో వైరల్ అయింది. లేటెస్ట్ గా కేరళలో కారులో హెల్మెట్ పెట్టుకోలేదన్న కారణంతో ఫైన్ వేసిన సంగతి కూడా వైరల్ అవుతోంది.