
అరగంట ముందే వెహికల్స్‌ను నిలిపేసిన పోలీసులు
ఎల్బీనగర్, వెలుగు: మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఎల్బీనగర్ సెగ్మెంట్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం కేటీఆర్ పర్యటించిన ప్రాంతాల్లో పోలీసులు అరగంట ముందే వెహికల్స్‌ను నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ఏర్పడింది. దీంతో డ్యూటీలు, ఇతర పనులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మంత్రికి ఫ్రీ రూట్ ఇచ్చే
టైమ్‌లో జనాల ఇబ్బందులు కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు.
బీజేపీ వాల్‌పోస్టర్స్ తొలగింపు
కేటీఆర్ వెళ్లే మార్గంలో బీజేపీ స్టిక్కర్స్ కానీ, వాల్ పోస్టర్స్ ఉండకుండా జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందితో వాటిని తొలగించారు. బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి గోడలపై ఉన్న పోస్టర్స్‌ను తీసివేయించారు. మంత్రి కొద్ది సేపట్లో వస్తున్నాడనే సమయంలో హడావుడిగా వాటిని తొలగించారు.