
- ఉప్పల్ డిపో నుంచి రింగ్ రోడ్డుకు గంట సమయం
ఉప్పల్, వెలుగు: రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాద్కు తిరిగి వస్తున్న ప్రయాణికుల రద్దీతో పాటు, ఉప్పల్ నల్ల చెరువు సమీపంలో వరంగల్ హైవేపై గుంతలు, ఫ్లైఓవర్ నిర్మాణంతో ఉప్పల్ రింగ్ రోడ్డు వైపు భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ట్రాఫిక్ సిబ్బంది కొంతవరకు రోడ్డు రిపేర్లు చేపట్టినా సమస్య తగ్గలేదు.
ఉప్పల్ డిపో నుంచి రింగ్ రోడ్డుకు చేరడానికి గంటపైగా సమయం పడుతుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోడుప్పల్, పీర్జాదిగూడ పరిధిలో రోడ్లు గుంతలమయంగా మారడం, ఆర్అండ్ బీ శాఖ నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.