లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు

లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు

వరంగల్: వరంగల్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. లైసెన్స్ లేకుండా బైకులు నడుపుతుకున్న  38 మంది మైనర్లను పట్టుకున్నారు. మైనర్లను కోర్టులో హాజరు పర్చగా వారిలో ఐదుగురిని జువైనల్ హోంకు తరలించాలని ఆదేశించింది. మరికొంతమందికి ఫైన్ వేసింది. కొద్ది రోజులుగా మైనర్ల డ్రైవింగ్ ను అరికట్టేందుకు స్పెసల్ నిర్వహిస్తున్నారు వరంగల్ ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటివరకు 113మంది మైనర్లను జువైనల్ హోంకి తరలించారు. 

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి వాహనాలు ఇవ్వొద్దని  ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. వాహనాలు పిల్లలకు ఇస్తే మైనర్ డ్రైవర్లతోపాటు తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ.