IND vs NZ Match : నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

IND vs NZ Match : నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోమాజిగూడ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ఆంక్షలు ఉంటాయని చెప్పారు. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్‌బీహెచ్‌ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్‌ఐ, ఉప్పల్ ప్రాంతవాసులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. 

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ వన్డే మ్యాచ్ కు పటిష్ఠమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. 2500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. స్టేడియంలోకి సెల్ ఫోన్ తప్ప మరే వస్తువులను లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. మైదానంలోకి వెళ్లి క్రికెటర్లను అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.