
- తెలంగాణ విమోచన దినోత్సవం నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ ఏరియాల్లో వెహికల్స్ డైవర్షన్
- పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ సమైక్యత వేడుకలు.. సాధారణ వెహికల్స్‌కు నో ఎంట్రీ
సికింద్రాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవం, జాతీయ సమైక్యత వేడుకల నేపథ్యంలో ఆదివారం గ్రేటర్ సిటీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవం, బీజేపీ భారీ బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హజరుకానున్న సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు తెలిపారు.
Also Raed:-ఈడీ విచారణకు వెళ్లకుండా దొండకాయలు కోస్తవా?: నారాయణ
పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ చుట్టుపక్కల రూట్లలో వెళ్లే వారు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని ఆయన కోరారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్, ఐడీ కార్డును చూపిస్తే బారికేడింగ్ పాయింట్ల నుంచి అనుమతిస్తామని ఆయన తెలిపారు. ట్రాఫిక్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా హెల్ప్ లైన్ నం.9010203626కు కాల్ చేయాలన్నారు.
ట్రాఫిక్ డైవర్షన్ ఇలా..
- పరేడ్ గ్రౌండ్ పక్కన ఉన్న రోడ్లో, సీటీవో నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే వెహికల్స్ ను అనుమతించరు.
- ప్లాజా క్రాస్ రోడ్ నుంచి ఎస్బీహెచ్ క్రాస్ రోడ్‌ను పూర్తిగా క్లోజ్ చేస్తారు. వైఎంసీఏ ఫ్లై ఓవర్ నుంచి మాత్రమే ట్రాఫిక్‌ను అనుమతిస్తారు.
- బోయిన్పల్లి, తాడ్ బండ్ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్ బాండ్ వద్ద సీటీవో వైపు మళ్లించనున్నారు.
- కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్బీహెచ్ ప్యాట్నీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను స్వీకార్ ఉపకార్ వద్ద టివోలి, బ్రూక్ బాండ్ వైపు మళ్లించనున్నారు.
- ఎస్ బీహెచ్ నుంచి వచ్చే వెహికల్స్‌ను స్వీకార్ ఉపకార్ వైపు అనుమతించరు.
- ఆర్టీఏ తిరుమలగిరి, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్ గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను టివోలి వద్ద దారి మళ్లించి స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ లేదా బ్రూక్ బాండ్, బాలంరాయి, సీటీవో మీదుగా పంపిస్తారు.టివోలి క్రాస్ రోడ్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్ రూట్‌ను రెండు వైపులా క్లోజ్ చేశారు