ఇకపై అత్యవసరమైతే సీఎం కాన్వాయ్నూ ఆపొచ్చు

ఇకపై అత్యవసరమైతే సీఎం కాన్వాయ్నూ ఆపొచ్చు

గువహటి: అస్సాం కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై అస్సాంలో సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఎక్కడా రోడ్లపై ట్రాఫిక్‌ను నిలిపేయకూడదని కేబినెట్ తీర్మానం చేసింది. ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ పేర్కొంది. పైగా అత్యవసరమైతే సీఎం కాన్వాయ్‌ను ఆపవచ్చని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో ప్రయాణించే సమయంలో అత్యవసరమైతే ఆయన కాన్వాయ్ ను రెండు నిమిషాల పాటు నిలపనున్నారు. కానీ అంతకంటే ఎక్కువ టైమ్ మాత్రం కాన్వాయ్ ను ఆపడానికి వీల్లేదు. సీఎం వల్ల ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి ప్రయాణించే టైమ్ లో ఒకవేళ రోడ్డుపై అంబులెన్స్ వెళ్తే.. ఆ వాహనానికి దారితోపాటు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హిమంత బిస్వా కేబినెట్ నిర్ణయించింది. 

అస్సాం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. సీఎం హిమంత బిస్వా శర్మ కాన్వాయ్ ను 22 నుంచి ఆరుకు కుదించింది. రాష్ట్ర రాజధాని గువహటి మెట్రోపాలిటన్ ఏరియాలో సీఎం కాన్వాయ్ లో ఆరు  వాహనాలు మాత్రమే ఉండనున్నాయి. అదే గువహటి దాటి వెళ్తే మాత్రం12 వెహికిల్స్ ఉండేలా రూల్ తీసుకొచ్చారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం:

నీ రాక కోసం ఆతృతతో ఎదురుచూశాం

జైలు నుంచే నామినేషన్ దాఖలు

పెళ్లి కూతురైన ‘నాగిని’ హీరోయిన్