బాలల అక్రమ రవాణా.. అడ్డుకున్న అధికారులు

బాలల అక్రమ రవాణా.. అడ్డుకున్న అధికారులు

రైలులో బాలలను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఖమ్మం రైల్వే స్టేషన్​ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.,. బాలల అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారాన్ని తెలుసుకున్న  కైలాష్​ సత్యార్థి ఫౌండేషన్, ఆర్పీఎఫ్​జీఆర్​పీ అధికారులు ఈస్ట్​ కోస్ట్​ ఎక్స్​ప్రెస్​ రైలులో అక్రమంగా తరలిస్తున్న నలుగురు బాలలను రక్షించారు.  

విజయవాడ ఖమ్మం మధ్యలో ఈ రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల నుంచి వారిని రక్షించిన అనంతరం వారిని బాలల సంక్షేమ కమిటీ ముందు ప్రవేశపెట్టారు.  వారిని వెస్ట్​బెంగాల్​ నుంచి తీసుకొచ్చినట్లుగా హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్తున్నట్లుగా నిందితులు చెప్పారు.  మానవ అక్రమ రవాణాను నిరోధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బాలల సంక్షేమ సమితి ఛైర్​పర్సన్​ భారతరాణి అన్నారు.  

తాత్కాలికంగా చిల్డ్రన్స్ కి షెల్టర్​ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమం లో బచ్పన్ బచావో ఆందోళన్ ప్రతినిధి నరేష్, ఆర్ పీ ఎఫ్ సీ ఐ శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.