షటిల్ ఆడుతుండగా విద్యుత్ షాక్‌ ..14 ఏళ్ల బాలుడి మృతి

షటిల్ ఆడుతుండగా విద్యుత్ షాక్‌ ..14 ఏళ్ల బాలుడి మృతి

హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం (ఆగస్టు 10) దుర్ఘటన చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో స్నేహితులతో కలిసి షటిల్ ఆడుతున్న 14 ఏళ్ల బాలుడు ఆకస్మికంగా విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికుల సమాచారం ప్రకారం..ఆట జరుగుతుండగా బాలుడు కొట్టిన షటిల్ కాక్ సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి బాలుడు తన చేతిలో ఉన్న బ్యాడ్మింటన్ రాకెట్‌ను పైకి చాపగా, రాకెట్ ట్రాన్స్‌ఫార్మర్‌కు తగిలి విద్యుత్ ప్రసారం అయింది. ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ నేలకూలిన బాలుడు స్పృహ కోల్పోయాడు.

స్థానికులు, కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ సంఘటనతో తండా అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం?

ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ సరైన రక్షణా కంచెలు లేకపోవడం, వైర్ల సురక్షితంగా లేని పరిస్థితి స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.