జయశంకర్ భూపాలపల్లిలో విషాదం..పంట పొలంలో రైతు సజీవ దహనం

జయశంకర్ భూపాలపల్లిలో విషాదం..పంట పొలంలో రైతు సజీవ దహనం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అకస్మాత్తుగా పొలంలో మంటలు చెలరేగి రైతు సజీవదహనమయ్యాడు. పొలంలో గడ్డి కట్టలకు అంటుకున్న మంటలను ఆర్పుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మంటలంటుకొని తీవ్ర గాయాలతో రైతు అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో రైతు కుంటుంబంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. 

శనివారం (మే23) సాయంత్రం జయశంకర్ పల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రేపాకపల్లి గ్రామ శివారులో పంటపొలాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి సమీపంలో గడ్డికట్టలను అంటుకున్నాయి. మంటలార్పే ప్రయత్నంలో రైతు చంద్రమౌళి(62) మంటల్లో చిక్కుకున్నాడు. తీవ్రగాయాలతో చంద్రమౌళి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. రైతుకుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.