విషాదం : 14 ఏళ్లకోసారి జరుపుకునే జాతరలో ఇద్దరు మృతి

విషాదం : 14 ఏళ్లకోసారి జరుపుకునే జాతరలో ఇద్దరు మృతి

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామదేవత ముగింపు ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. 14 ఏళ్లకోసారి జరుపుకొనే అసిరితల్లి పండగలో సిరిమాను విరిగి ఇద్దరు మృతి చెందారు. బుడగట్లపాలేనికి చెందిన వందమంది మత్స్యకారులు సిరిమాను లాగుతుండగా పైన ఉన్న సీల జారిపోయింది. దీంతో కుప్పిలికి చెందిన నాయన చిన్నప్పడు సిరిమానుతో పాటు కిందపడిపోయాడు.

 అప్పన్న, పల్లేటిపై పీట పడిపోవడంతో అప్పన్న అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన పల్లేటిని హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఈశ్వరరావు కుప్పిలికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.