
పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ముగ్గురు క్రికెటర్లు చనిపోయారు. శనివారం(అక్టోబర్18) పాక్టికా ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు క్లబ్లెవెల్ క్రికెటర్లతో సహా 8మంది మృతిచెందారు. ఆటగాళ్లు కబీర్, సిబ్ఘతుల్లా ,హరూన్ తోపాటు మరో ఐదుగురు మృతిచెందినట్లు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. శుక్రవారం(అక్టోబర్17) మ్యాచ్ లు ఆడి షఠానా నుంచి ఆర్గాన్ కు తిరిగి వెళ్తుండగా బాంబు దాడులో యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
మరోవైపు పాకిస్తాన్ తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల మధ్యా పాకిసాన్, శ్రీలంకతో రాబోయే సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) వైదొలిగింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని సరిహద్దు ప్రావిన్స్‌లో పాకిస్తాన్ తాగా దాడితో కాల్పుల విరమణను ఉల్లంఘించిన తర్వాత ఈ నిర్ణయం వచ్చింది.