హైదరాబాద్ లో వ్యక్తి దారుణహత్య

హైదరాబాద్ లో వ్యక్తి దారుణహత్య

హైదరాబాద్ :  కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. జియాగూడ రోడ్డుపై అందరూ చూస్తుండగానే ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తిని కత్తులతో నరికి చంపారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఈ ఘటనను చూసి స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. మరోవైపు కొంతమంది వాహనదారులు ఈ ఘటనను చూస్తూ వెళ్లిపోయారు. ఏ ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు.