
తూప్రాన్, వెలుగు: జీతం మొత్తం లోన్ కట్టడానికే సరిపోతుండడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో బుధవారం జరిగింది. పట్టణానికి చెందిన మోడబోయిన రామకృష్ణ (35) సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ వద్ద అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల కింద పర్సనల్ లోన్ తీసుకున్నాడు. తనకు వచ్చే జీతంలో ఎక్కువ డబ్బులు లోన్‌కే పోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
మంగళవారం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వడియారంలో ఉండే పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చిన రామకృష్ణ.. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడి కొడుకు గమనించి చుట్టుపక్కల వాళ్లకు చెప్పాడు. వారు వచ్చి చూడగా అప్పటికే రామకృష్ణ చనిపోయాడు.